సిటీబ్యూరో, జూలై 11(నమ స్తే తెలంగాణ): బోనాల ఉత్సవా లు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కు మార్ గౌడ్ పేర్కొన్నారు. గో ల్కొండ కోటలో గౌడ ఐక్య సాధ న సమితి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు బబ్బూరి భిక్షపతి గౌడ్ల ఆధ్వర్యంలో కల్లు ఘటం సాక కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పల్లె రవి కుమార్ గౌడ్ గోల్కొండ కోటలో రేణుక ఎల్లమ్మ దేవికి కల్లు బోనం సమర్పించారు.
అనంతరం, ఆయన మాట్లాడుతూ, 365 ఏండ్ల క్రితం సామా న్య కల్లుగీత కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గోల్కొండ కోటలో కల్లు ఘటం సాక ఏర్పాటుచేసి ఎల్లమ్మకు గుడి కట్టి, సబ్బండ వర్గాలకు సహ పంక్తి భోజనాలు ఏర్పాటుచేసిన సంస్కృతిని కొనసాగిస్తున్నామన్నారు. గత పదేండ్ల నుంచి గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న కృషి అభినందనీయమన్నా రు. ఈ సందర్భంగా పల్లె రవి కుమార్ గౌడ్ సీఎం కేసీఆర్ ను కలిసి కల్లు బోనం వివరాలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, గౌడ సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ పాల్గొన్నారు.