మత్తు రహిత సమాజాన్ని నిర్మిద్దాం
మత్తు రహిత సమాజాన్ని నిర్మిద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో (టీన్యాబ్) ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వద్ద మంగళవారం అవగాహన వాక్‌ను ఏర్పాటు చేశారు.
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఖైరతాబాద్, జూన్ 25 : మత్తు రహిత సమాజాన్ని నిర్మిద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తెలంగాణ యాంటి నార్కోటిక్స్ బ్యూరో (టీన్యాబ్) ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వద్ద మంగళవారం అవగాహన వాక్‌ను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వాక్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, రాష్ట్ర డీజీపీ రవి గుప్తా, టీన్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల బారిన పడి ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో మత్తు పదార్థాలు కనబడకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టీన్యాబ్ ఆధ్వర్యంలో మత్తుల వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ రూపొందించిన ‘రామచక్కని కొడుక’ పాట ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైల్వేశాఖ అదనపు డీజీపీ ఎంఎం భగవత్, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ సంజయ్ కుమా ర్ జైన్, అదనపు సీపీ విక్రమ్‌సింగ్, డీజీ (డీసీఏ) కమలాసన్ రెడ్డి, ఐజీ రమేశ్ రెడ్డి,రాచకొండ సీపీ తరుణ్ జోషి పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

