సీతారాముల కల్యాణం.. కమనీయం
శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తుల సాక్షిగా అర్చకులు సీతారాముల కల్యాణం జరిపించారు.
- భారీగా తరలివచ్చిన భక్తులు.. ఆలయాల్లో అన్నదానాలు..పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి, కార్పొరేటర్లు
మల్కాజిగిరి జోన్ బృందం, మార్చి 30 :శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తుల సాక్షిగా అర్చకులు సీతారాముల కల్యాణం జరిపించారు. గురువారం మల్కాజిగిరి నియోజకవ ర్గంలోని ఆలయాలు, కాలనీల్లో ఏర్పాటు చేసిన కల్యాణ మండపాల్లో సీతారాముల విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి.. రాములవారితో సీత మెడలో తాళి కట్టించారు. ఈ కమనీయమైన వేడుకను చూసి భక్తు లు తరించిపోయారు. పలు జంటలు కల్యాణంలో కూర్చున్నాయి. కల్యాణం అనంతరం పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు.
అల్వాల్‌లో శ్రీసీతారామ సంకీర్తన సంఘం ఆధ్వర్యంలో జరిగిన కల్యాణంలో సంఘం చైర్మన్ కందకట్ల సుదర్శన్ రెడ్డి, సెక్రటరీ పరాంకుశం మాధవ్, గోపాలకృష్ణ, లక్ష్మణ్, శ్రీనివాస్‌రావు, భాస్కర్ గుప్తా, రామచంద్రారావు, తలారి నాగి, భక్తులు పాల్గొన్నారు.
రామ్‌నగర్‌లోని శ్రీషిర్డీ సాయిబాబా ఆలయంలో షిర్డీ సాయిబాబా జయంతి ఉత్సవాలతోపాటు శ్రీరాములవారి కల్యాణం కనులపండువగా జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హాజరయ్యారు. సెక్రటరీ వేణుగోపాల్, భక్తులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర దేవాలయంలో కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. అలాగే.. నేరేడ్మెట్ డివిజన్ డిఫెన్స్‌కాలనీలోని రామాలయంలో వైభవంగా కల్యాణోత్సవం జరిగిం ది. నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ నర్సింహస్వామి, దేవాలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణా చార్యులు, అర్చకులు తులసీ వెంకట రమణా చార్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి రవీంద్రారెడ్డి, క్లర్క్ సండ్ర సుధాకర్, మాజీ చైర్మన్లు ఉమేశ్‌సింగ్, రామదాసు సంతోష్ ముదిరాజ్, మాజీ ధర్మకర్తలు రవీందర్, జీఎన్వీ సతీష్ కుమార్, గణేశ్, డిఫెన్స్‌కాలనీలో జరిగిన వేడుకల్లో అధ్యక్షుడు విజయ సారధి, కేవీ రావు, శివయ్య, ప్రకాశ్‌రెడ్డి, బీఎన్ఎన్ రెడ్డి, రాజరత్న, కేఎస్ రావుపాల్గొన్నారు.
ఈస్ట్ ఆనంద్‌బాగ్, వెంకటాపురం, మల్కాజిగిరి డివిజన్లలో జరిగిన సీతారాములవారి కల్యాణంలో కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, సబితాకిశోర్, శ్రవణ్‌కుమార్, రాజ్ జితేంద్రనాథ్, నేతలు బాబు, సంపత్‌రావు, అనిల్‌కిశోర్, విజయకుమారి, సుభాష్, వెంకటేశ్వరరెడ్డి, కిశోర్, మాధ వి, ముత్యంరెడ్డి,మల్లేశ్‌గౌడ్,సుబ్బారావు,ఉమ,నారాయణ పాల్గొన్నారు.
డివిజన్, ఇందిరానెహ్రూనగర్, మల్లికార్జుననగర్ మల్లన్న దేవాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకల్లో కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్, తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్, కార్యకర్తలు, నాయకులు, భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
హనుమాన్‌నగర్‌లోని అభయాంజనేయస్వామి దేవాలయంలో జరిగిన కల్యాణ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు ఈశ్వరప్ప, ఆర్.ఆదినారాయణ, ఉషా, గౌలికార్ శైలేందర్, ప్రవీణ్, సత్యం, నర్సింహాచారి, పి.గోవింద్, వెంకటేశ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

