ఆర్కేపురం, డిసెంబర్ 21: నగరంలోని కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన వైభవం షాపింగ్ మాల్‌ను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ రాష్ట్ర రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సినీనటి శ్రీలీల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేసింది. దీంతో అభిమానులు శ్రీలీలను చూసేందుకు భారీగా తరలివచ్చారు. శ్రీలీల పలు వస్ర్తాభరణాలను పరిశీలించి వాటిని ప్రదర్శించారు. ప్రారంభోత్సవం సందర్భంగా వైభవం మాల్ ఎండీ వలస చలపతి, ఆఫ్తాబ్ అహ్మద్ ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోలుదారులతో షాపింగ్ మాల్ సందడిగా మారింది.