సిటీబ్యూరో, మే16, (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌లోని ఎస్పీఆర్ హిల్స్ ప్రజలు పడుతున్న నీటి కష్టాల నేపథ్యంలో ఆ ప్రాంతంలో నిర్మించిన వాటర్ రిజర్వాయర్‌ను ప్రారంభించాలని ‘బీఆర్ఎస్ నిర్మించింది.. కాంగ్రెస్ విస్మరించింది’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో గురువారం ప్రచురించిన కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. నేడు ఎస్పీఆర్ హిల్స్‌లోని 3ఎంఎల్ రిజర్వాయర్‌ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.