హైదరాబాద్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో (Jubilee hills) కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం పెద్దమ్మగుడి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరచుకోవడంతో కారులో ఉన్నవారికి ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం ధాటికి కారు ముందు చక్రాలు ఊడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.