కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్సీటీ) ఢిల్లీకి తెలంగాణ, ఏపీల నుంచి వెళ్లే ప్రయాణికులు తప్పకుండా 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరైనా వ్యాక్సిన్ తీసుకుని ఉంటే.. రెండు రోజుల వాక్సినేషన్‌కు సంబంధించిన సర్టిఫికెట్, నెగెటివ్ ఆర్టీపీసీఆర్ రిపోర్టును ప్రయాణానికి ముందు 72 గంటల ముందు సమర్పించాలన్నారు. అలాగే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా రైల్వే ప్రయాణికుల కోసం శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్న ప్రయాణికులను తమ రాష్ర్టానికి అనుమతిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాబట్టి, రైల్వే ప్రయాణికులంతా ఆయా రాష్ర్టాలకు చెందిన కొవిడ్ నిబంధనలు తెలుసుకుని ప్రయాణాలు చేయాలని సూచిస్తున్నారు.