సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పన, సామర్థ్యం పెంపు, మెరుగైన భద్రతా చర్యల కోసం దక్షిణ మధ్య రైల్వే నిరంతరంగా కృషి చేస్త్తుంది. అందు లో భాగంగా ఉందానగర్-గొల్లపల్లి మధ్య 60కిలోమీటర్ల డబుల్ లైన్ విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. ఇది హైదరాబాద్ నుంచి కర్నూల్, అనంతపురం,బెంగళూరు , కడప, తిరుపతి వంటి ప్రధాన నగరాలతో అనుసంధానించడంలో కీలకమైనది. ఈ ప్రాజెక్టు రైల్వే పీఎస్యూ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని శనివారం ఎస్సీఆర్ అధికారులు ప్రకటించారు.అదే విధంగా సికింద్రాబాద్-మహబూబ్నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. 85కి.మీ నిడివి ఉన్న ఈ ప్రాజెక్టు రూ.774 కోట్ల అంచనా వ్యయంతో 2015-16లో మంజూరు చేశారు. సికింద్రాబాద్- ఉందానగర్ మధ్య 28 కి.మీ ప్రాజెక్టు నుంచి మినహాయించబడింది. అయితే దీనిని ఎంఎంటీఎస్ రెండో దశ కింద ప్రాజెక్టు చేపట్టడంతో పాటు ఆ మేరకు పనులు చేశారు.