సిటీబ్యూరో, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే – హైదరాబాద్ డివిజన్ కాచిగూడ స్టేషన్ నుంచి తొలిసారిగా కిసాన్ రైలును సరుకు రవాణా కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి 284 టన్నుల ఉల్లిగడ్డలను అగర్తలాకు రవాణా చేశారు. ఈ మేరకు మొత్తం 12 పార్సిల్ వ్యాన్లలో తరలించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు రూ.18.3 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. వ్యవసాయ రంగం, రైతులు బలోపేతానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో భారతీయ రైల్వే ప్రవేశ పెట్టిన కిసాన్ రైలు లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.