సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : నీటిని పొదుపు చేయడంపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. ప్రయాణికుల సౌకర్యార్థ్ధం రైలు బోగీలలో నీటిని నింపే ప్రక్రియను వేగవంతం చేసింది. తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ‘క్విక్ కోచ్ వాటరింగ్’ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం వల్ల నీటి వృథాను అరికట్టడంతో పాటు సమయం కూడా ఆధా అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి రైలులో సగటున 40వేల లీటర్ల నీటిని కేవలం ఐదు నిమిషాల్లోనే నింపుకోవచ్చని రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.