సిటీబ్యూరో, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ): ‘దూద్ దురంతో’ ప్రత్యేక రైలు ద్వారా దక్షిణ మధ్య రైల్వే రేణిగుంట నుంచి 10 కోట్ల లీటర్ల పాలను దేశ రాజధాని ఢిల్లీకి పంపినట్లు మంగళవారం రైల్వే అధికారులు ప్రకటించారు. మంగళవారం నాటికి మొత్తం 443 ట్రిప్పుల ద్వారా 2,502 పాల ట్యాంకర్లను రవాణా చేసి, 10 కోట్ల లీటర్ల మైలురాయిని చేరుకుందన్నారు. దేశ అవసరాలను తీర్చడంలో ‘దూద్ దురంతో’ ప్రత్యేక రైళ్లు కీలకమన్నారు. కొవిడ్ కంటే ముందుగా కేవలం వారానికి ఒకసారి మాత్రమే ప్రత్యేక రైలు ఉండేదన్నారు. లాక్డౌన్ విధించిన తర్వాత వారి అవసరాల కోసం ‘దూద్ దురంతో’ ప్రత్యేక రైళ్లను ప్రారంభించిందని రైల్వే అధికారులు వెల్లడించారు.