హైదరాబాద్: పని ఒత్తిడి, ఉద్యోగం పోతుందనే భయంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software engineer) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని (AP) గుంటూరు (Guntur) జిల్లాకు చెందిన వినోద్ కుమార్ హైదరాబాద్ (Hyderabad) పుప్పాలగూడలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంచేస్తున్నారు. సంస్థ ఒత్తిడి, ఉద్యోగం పోతుందని తీవ్ర మనస్థాపంతో తాను ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.