రంగారెడ్డి : అత్తాపూర్(Attapur)లో విషాదం చోటు చేసుకుంది. ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్(Software engineer) ఆత్మహత్య(Commits suicide)కు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే అతిథి భరద్వాజ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ హాఫీ హోమ్ ఫార్చూన్ అపార్ట్మెంట్ లోని తన ప్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
కాగా, ఓ అబ్బాయితో ప్రేమలో అతిథి తనను వాడుకొని మోసం చేశాడని తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.