Social Media | సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): సోషల్‌మీడియా కాపురాలను కూల్చేస్తుండటంతో దంపతులు పోలీస్స్టేషన్ల మెట్లెక్కుతున్నారు. సోషల్‌మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలే కొంప ముంచేస్తున్నాయి. అటు భార్య, ఇటు భర్త ఇద్దరూ ఈ సమస్యలతో ఠాణాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ గుర్తుతెలియని వ్యక్తుల పరిచయాలతో అనుమానాలు పెనుభూతమై కొన్ని సందర్బాల్లో ప్రాణాలు సైతం తీస్తున్నాయి. ఇటీవల మహిళా పోలీస్స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో ప్రతి రోజు సోషల్‌మీడియా ప్రభావితంతో కాపురాల్లో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మహిళా పోలీస్స్టేషన్లలో ఇలాంటి ఫిర్యాదులు వస్తుండటంతో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి దంపతుల మధ్య ఉండే అనుమానాలు నివృత్తి చేసుకునేలా చేస్తున్నారు. ఇందుకు మహిళా భద్రత విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. సోషల్‌మీడియా యాప్‌ల గురించి తెలియకున్నా.. వారి ఫోన్లలో యాప్‌లు ఉంటున్నాయి. ఇతరుల సాయంతో వాటిని ఇన్స్టాల్ చేసి టైం పాస్ కోసం యాప్‌లలో కొంత సమయం వెచ్చిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తవారితో పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఆ పరిచయాలు కొన్ని సందర్భాల్లో శృతి మించుతున్న ఘటనలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి సమస్యలు ఏదో ఒక వర్గానికి సంబంధించి మాత్రమే కాదు.. చదువు కాని వారి నుంచి ప్రొఫెషనల్ చదువులు చదివిన దంపతుల్లోనూ ఈ సమస్యలు వస్తున్నాయి. టెక్నాలజీ పెరిగిందని సంబరపడాలో.. ఈ టెక్నాలజీ కాపురాలను కూల్చుతుందని బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో బాధితుల బంధువులు ఆందోళనలో ఉంటున్నారు.
ఇలాంటి ఘటనలు..