చేతులు కాళ్లు కట్టేసి.. నడుముకు రాయికట్టి
ముక్కుపచ్చలారని ఆరేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేయడమే కాకుండా కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన శనివారం రాత్రి బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు కథనం ప్రకారం.. కౌకూర్‌లోని విల్లా ఆర్చిడ్స్ అపార్ట్మెంట్లో మిల్టన్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు.
- సంపులో పడేసి చిన్నారి హత్య
బొల్లారం,అక్టోబర్ 11 : ముక్కుపచ్చలారని ఆరేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేయడమే కాకుండా కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన శనివారం రాత్రి బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు కథనం ప్రకారం.. కౌకూర్‌లోని విల్లా ఆర్చిడ్స్ అపార్ట్మెంట్లో మిల్టన్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడి కుమార్తె మోసెస్ అరులియా శనివారం రాత్రి అపార్ట్మెంట్ సెల్లార్లో ఆడుకుంటూ కొంత సేపటికే.. కనిపించకుండా పోయింది. చిన్నారి జాడ కోసం అపార్ట్‌మెంట్‌తో పాటు పరిసరాల్లో వెతికిన కుటుంబసభ్యులకు రాత్రి సుమారు 11గంటల సమయంలో దుండగుడి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. చిన్నారి తాతతో ఫోన్‌కాల్ మాట్లాడిన దుండగుడు పాపను విడిచిపెట్టాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ పుటేజ్‌లను పరిశీలించగా అపార్ట్మెంట్లో కొద్ది రోజుల కిందట వరకు పనిచేసి, మానేసిన విక్రమ్.. చిన్నారి వెనుక వెళ్లినట్లుగా గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజి, నిందితుడి ఫోన్‌కాల్ లొకేషన్ ఆధారంగా చిన్నారిని కిడ్నాప్ చేసింది రెండు రోజు ల కిందట వరకు అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన బీహార్ వాసి విక్రమ్‌గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడు అదే అపార్ట్మెంట్లోని క్లబ్‌హౌస్‌లో ఉన్న సంపు వద్ద తచ్చాడుతూ కనిపించడంతో నీటి సంపులో పరిశీలించి చూడగా అందులో చిన్నారి మృతదేహం కనిపించింది.
అయితే పోలీసులకు సమాచారం చేరిందని భావించిన నిందితుడు చిన్నారి నడుముకు రాయికట్టి, కాళ్లు, చేతులు, కట్టేసి సంపులో పడేసి దారుణంగా హత్యచేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చా రు. చిన్నారిని సంపులో పడేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు పారిపోయినట్లు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన విక్రమ్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు మూడు రోజు ల కిందటే అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిపై కక్ష పెంచుకున్న విక్రమ్ చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది కాకుండా చిన్నారిని హత్య చేయడానికి దారితీసిన ఇతర పరిస్థితులపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా నిందితుడిని ఆదివా రం మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తునట్లుగా సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

