శంషాబాద్ రూరల్, జూలై 10 : ఓ స్విగ్గీ డెలవరీ బాయ్ నుంచి శంషాబాద్ ఎస్వోటీ, ఆర్జీఐఏ పోలీసులు 11 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని వివిధ లాడ్జీలు, హోటళ్లలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పక్క సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం రాత్రి సమయంలో శంషాబాద్ పట్టణంలోని ఓ హోటల్ వద్ద ఒకరు ఎండీఎంఏ డ్రగ్ అమ్ముతుండగా, పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి తమిళనాడు రాష్ర్టానికి చెందిన మురళీధరన్‌గా గుర్తించారు. నిందితుడికి భా ర్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి తో కలిసి బెంగళూరులో నివాసముంటూ.. స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అతడిని ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.