మేడ్చల్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ సభకు స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు తెలిపారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి సభకు 50 వేల మందితో తరలివెళ్తాం. ఐదు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశాలు నిర్వహించి బీఆర్ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు: బీఆర్ఎస్ రజతోత్సవ సభపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. సభను విజయవంతం చేసేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు: సభను విజయవంతం చేసేందుకు జిల్లాలోని ఎమ్మెల్యేలు నిర్వహించిన సన్నాహక సమావేశాలతో చేసిన బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులకు చేసిన దిశా నిర్దేశంతో రజతోత్సవ సభకు రావాలని అందరిని ఆహ్వానించే విధంగా ఇంటింటికీ ఆహ్వాన పత్రికల అందజేత, ర్యాలీలు, వాల్ పోస్టర్ల ఆవిష్కరణ, గోడలపై వాల్ రైటింగ్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు: ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. 16 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు పూర్తిగా విరక్తి చెందుతున్నారు. అన్ని రంగాల వారికి ఎలాంటి న్యాయం జరగక పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలనే తెలంగాణలోని ప్రజలందరూ కోరుకుంటున్నారు.