జాతీయ భావాన్ని పెంపొందించాలి
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశ సమైక్యత, జాతీయ భావాన్ని పెంపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సికింద్రాబాద్ సోమసుందరం వీధిలో మంజు థియేటర్ వద్ద కొత్త ఎల్లయ్య మెమోరియల్ స్కూల్, మక్తాల ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో 800 మీటర్ల జాతీయ పతాకంతో చేపట్టిన ర్యాలీని మంత్రి తలసాని హాజరై ప్రారంభించారు
- మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
- విద్యార్థులతో కలిసి జాతీయ పతాకాలతో ర్యాలీ
బేగంపేట్/జూబ్లీహిల్స్/ అమీర్‌పేట్/ బన్సీలాల్‌పేట్/వెంగళరావునగర్ ఆగస్టు 13: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశ సమైక్యత, జాతీయ భావాన్ని పెంపొందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సికింద్రాబాద్ సోమసుందరం వీధిలో మంజు థియేటర్ వద్ద కొత్త ఎల్లయ్య మెమోరియల్ స్కూల్, మక్తాల ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో 800 మీటర్ల జాతీయ పతాకంతో చేపట్టిన ర్యాలీని మంత్రి తలసాని హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, పాఠశాల కరస్పాండెంట్ శాంతన్‌కుమార్, ప్రిన్సిపాల్, జాన్సీరాణి, మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జలంధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- సికింద్రాబాద్ వస్త్ర వ్యాపారుల ఆధ్వర్యంలో వజ్రోత్సవాలను నిర్వహించారు. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని బట్టల బజారులో 75 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. బట్టల బజార్, టుబాకో బజార్, మహంకాళి పోలీస్‌స్టేషన్, సుభాశ్రోడ్డు మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. సికింద్రాబాద్ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు అమ్మనబ్రోలు ప్రకాశ్, ప్రధాన కార్యకర్శి చీర శ్రీకాంత్, కట్‌పీస్ అసోసియేషన్ అధ్యక్షులు భగత్రాంగుప్తా, ప్రధాక కార్యదర్శి సంతోష్ చౌకానీ,టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- సమైక్యతను చాటుతూ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, వెంగళరావునగర్ డివిజన్ కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్య విజయ్ పేర్కొన్నారు. శనివారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్సీసీ విద్యార్థులతో నిర్వహించిన సమైక్యత ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, టీఆర్ఎస్ నాయకులతో కలిసి యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ నుంచి కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఏఎంవోహెచ్ డాక్టర్ బిందు భార్గవి, సూపర్వైజర్ విజయ్‌కుమార్, ఏఎంసీలు ప్రేమ్‌కుమార్, నాగార్జున, ఇన్చార్జి హెచ్ఎం నరసింహ, ఎన్సీసీ అధికారి ప్రభాకర్, నాయకులు పాల్గొన్నారు.
- వజ్రోత్సవాలను పురస్కరించుకుని ‘బాల్యమిత్ర ఫౌండేషన్’ ఆధ్వర్యంలో శనివారం పద్మారావునగర్‌లో రెండు కిలోమీటర్ల ‘తిరంగా పాదయాత్ర’ నిర్వహించారు. స్వామి వివేకానంద విగ్రహం వద్ద పాదయాత్రను పోలీస్ శాఖలోని షీ టీమ్స్ విభాగం అదనపు డీసీపీ శిరీష రాఘవేంద్ర జెండా ఊపి ప్రారంభించారు. భారీ జాతీయ జెండా పట్టుకుని ఎస్పీ కాలేజీలోని సర్దార్ పటేల్ విగ్రహం వరకు కొనసాగిన ర్యాలీ ముగింపు సభకు పోలీస్ శాఖ మహిళా రక్షణ విభాగం డీఐజీ, ఐపీఎస్ సుమతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల్యమిత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు భరత్‌కుమార్, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, ఉస్మానియా పట్టభద్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ గోపాలచారి, ఎస్పీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, ఎస్పీ కాలేజ్, సాయివిజ్ఞాన భారతి కాలేజీ, కస్తూర్బా మహిళా కళాశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
- సమరయోధుల త్యాగఫలంతోనే దేశం నేడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుందని ఆర్మీ మాజీ మేజర్ జనరల్ నందిరాజు శ్రీనివాస్ అన్నారు. శనివారం శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్మీ మాజీ మేజర్ జనరల్ నందిరాజు,ప్రముఖ వక్త గంప నాగేశ్వరరావు, ఆన్లైన్ ద్వారా ఎంపీ టీజీ వెంకటేశ్ హాజరయ్యారు. ఐ స్టాండ్ ఫర్ వారియర్స్ సంస్థ జయహో కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఆగస్టు 15న దేశ, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు 12 గంటలు జాతీయ గీతాలాపన చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నారై కో ఆర్డినేటర్ ఫర్ తెలంగాణ మహేశ్ బిగాల, ఐ స్టాండెడ్ ఫర్ వారియర్స్ ట్రస్టీ హరికృష్ణ, అమెరికా నుంచి సూర్య విడియాల, వైద్యులు శ్రీనివాస్ పాల్గొన్నారు.
- నాటి స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతి వైద్యశాల సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ అన్నారు. శనివారం దవాఖాన ప్రాంగణంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుంచి మెయిన్ గేట్ వరకు వైద్య సిబ్బంది జాతీయ పతాకాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. మహబూబ్‌ఖాన్ మాట్లాడుతూ తెల్లదొరలను గడగడలాడించిన భరతమాత ముద్దుబిడ్డలను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నరేందర్, డాక్టర్ ప్రమోద్ కుమార్, డాక్టర్ జయశ్రీ హెలెన్, డాక్టర్ సీమ తబుస్సుమ్, మేరి మార్గరెట్, టీఎన్జీవోస్ నాయకులు ఉమర్ఖాన్, రమేష్ కుమార్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, నాలుగో తరగతి సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
- సనత్‌నగర్ బీకేగూడలో స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ అధినేత సూర్నేని మోహన్‌నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన వజ్రోత్సవాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డితో కలిసి విద్యార్థులు ఫ్రీడమ్ వాక్ ర్యాలీని ప్రారంభించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

