కంటోన్మెంట్‌కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ గులాబీ గూటికి చేరారు. ఈ మేరకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సమక్షంలో ముప్పిడి గోపాల్ గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ముప్పిడి గోపాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, మూడోసారి సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. ముప్పిడి గోపాల్‌తో పాటు సీఎం సమక్షంలో కంటోన్మెంట్‌కు చెందిన సుమారు 100మంది వరకు బీఆర్ఎస్లో చేరారు.

టీడీపీ రాష్ట్ర నాయకుడు బండారి వెంకటేశ్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్తో పాటు కార్వాన్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర నాయకుడు బండారి వెంకటేశ్ ముదిరాజ్ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్‌ను కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వచనం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి పని చేస్తానని తెలిపారు. ఆయనతో పాటు నాయకులు శివరాజ్, బండారు నాగరాజు, దేవేందర్, చంద్రకాంత్, సాయికృష్ణ, మధు కాకతో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.