సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): నగర పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో 2021 డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు ఆయన నగర సీపీగా పనిచేశారు. తిరిగి మరోసారి ఆయనను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీవీ ఆనంద్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటామని, నేరస్తులతో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
రాగల రెండు రోజులు..
సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ):బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా, సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 26.8, కనిష్ఠం 23.6డిగ్రీలు, గాలిలో తేమ 80 శాతంగా నమోదైనట్లు తెలిపారు.