మలక్‌పేట, ఏప్రిల్ 6: సలీంనగర్‌లోని ఆజంపురా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. డీజీ శిఖాగోయల్ ఆదేశాల మేరకు సిటీ-2 యూనిట్ డీఎస్పీ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు గణేశ్, సురేందర్‌రెడ్డి, రవీందర్, కరుణాకర్ టీం సభ్యులతో కలిసి తనిఖీలు చేశారు. ప్రజలకు అందుతున్న సేవలు, పత్రాల పరిశీలన, డాక్యుమెంట్ రైటర్లు, దళారుల ప్రమేయం ఏమైనా ఉందా, ప్రజలు ఏమైనా అసౌకర్యానికి గురవుతున్నారా అన్న అంశాలను పరిశీలించారు.
ఉద్యోగులు వెంట తెచ్చుకున్న డబ్బులకు సంబంధించిన వివరాలు రిజిస్టర్లో నమోదు చేయలేదని గుర్తించారు. రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను బ్రోకర్లకు ఇవ్వటాన్ని గమనించినట్లు వెల్లడించారు. కొన్ని డాక్యుమెంట్లను పెండింగ్‌లో పెట్టారని, సిక్‌లీవ్‌లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ వచ్చిన తర్వాత కనుక్కుంటామని, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ సలేహ విధులు నిర్వహిస్తున్నారన్నారు.

Hyd