MMTS Trains | హైదరాబాద్ : క్రిస్టియన్లకు శుభవార్త. ఈ నెల 20వ తేదీన ఈస్టర్ ఫెస్టివల్ నేపథ్యంలో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలోని కల్వరి టెంపుల్‌కు వెళ్లే వారు ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించారు. 20వ తేదీన మొత్తం మూడు ఎంఎంటీఎస్ స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉండనున్నారు.
హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే ఎంఎంటీఎస్ రైలు.. 20వ తేదీన తెల్లవారుజామున 3.15 గంటలకు హైదరాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరి లింగంపల్లికి ఉదయం 4.05 గంటలకు చేరుకోనుంది. ఫలక్‌నుమా – లింగంపల్లి ఎంఎంటీఎస్ రైలు.. ఫలక్‌నుమాలో తెల్లవారుజామున 2.30 గంటలకు బయల్దేరి.. సికింద్రాబాద్‌కు 3.05 గంటలకు, లింగంపల్లికి ఉదయం 4 గంటల వరకు చేరుకోనుంది. లింగంపల్లి – ఫలక్‌నుమా రైలు లింగంపల్లిలో 2.50కి బయల్దేరి, సికింద్రాబాద్‌కు 3.30కి, ఫలక్‌నుమాకు ఉదయం 4.30 గంటలకు చేరుకోనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.