అంబర్పేట, డిసెంబర్ 10: ఫంక్షన్కు వెళ్లొస్తానని చెప్పి యువతి అదృశ్యమైన ఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. నల్లకుంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్ గుం డు ప్రాంతానికి చెందిన మౌనిక ఈనెల 9న తన స్నేహితురాలి ఎంగేజ్మెంట్ ఫంక్షన్కు వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి ఇప్పటివరకు తిరిగి రాలేదు.
తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేక పోవడంతో బాధితురాలి సోదరుడు సాయికుమార్ శనివారం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.