సికింద్రాబాద్, నవంబర్ 18 : రోడ్డుపై దొరికిన రూ. 2 లక్షలను పోలీసులకు అందజేసి నిజాయతీ చాటుకున్నాడో వ్యక్తి. లాలాగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లాలాపేటకు చెందిన సతీశ్‌కు సోమవారం ఉదయం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం మీదుగా నడుచుకుంటూ వెళ్తుండగా, రోడ్డుపై 2 లక్షలు కనిపించాయి.
వెంటనే స్థానికుల సహాయంతో లాలాగూడ పోలీసులను సంప్రదించి నగదును అప్పగించాడు. నిజాయతీ చాటుకున్న సతీశ్‌ను పోలీసులు అభినందించారు.