Tolichowki | హ్యూమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి, టోలిచౌకి సాలార్జంగ్ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నానల్నగర్ సాలార్జంగ్ కాలనీ యూసుఫ్ టెక్రి పెట్రోల్ బంక్ వెనుక ఎస్ఎం కుత్బుద్దీన్ (72) అనే వ్యక్తికి సంబంధించిన గోడౌన్ ఉన్నది.
షార్ట్ సర్క్యూట్ నేపథ్యంలో మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్థానిక ఇన్స్పెక్టర్ సైదేశ్వర్ తెలిపారు.
– మెహిదీపట్నం మార్చి 15