Cyber Crime | అక్రమ దందా అంటూ.. డిజిటల్ లాక్!
మీ పేరుతో అక్రమ దందా నడుస్తుంది.. మేము సీబీఐ అధికారులం.. మిమ్మల్ని వెంటనే ఇంటర్వ్యూ చేయాలి.. అంటూ అమాయకులను డిజిటల్ లాక్ చేస్తున్న సైబర్‌నేరగాళ్లు.. బాధితుల బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు.
- స్కైప్, వాట్సాప్ ఇంటర్వ్యూఅంటూ హడావుడి
- బాధితులను ఒత్తిడికి గురిచేస్తూ బ్యాంకు ఖాతాలు లూటీ
- అలాంటి కాల్స్‌కు పట్టించుకోకండి
- పోలీసుల సూచన
- సీబీఐ, కస్టమ్స్, ఐటీ అంటూ బెదిరింపుల
Cyber Crime | సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): మీ పేరుతో అక్రమ దందా నడుస్తుంది.. మేము సీబీఐ అధికారులం.. మిమ్మల్ని వెంటనే ఇంటర్వ్యూ చేయాలి.. అంటూ అమాయకులను డిజిటల్ లాక్ చేస్తున్న సైబర్‌నేరగాళ్లు.. బాధితుల బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై నుంచి సీబీఐ, కస్టమ్స్, ఐటీ, సైబర్‌క్రైమ్, క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ అమాయకులను బెంబేలెత్తిస్తున్నారు. నిజమా..! అది అబద్ధ్దమా? అని ఆలోచించేలోపే.. మీ అరెస్టు తప్పందంటూ.. గడగడలాడిస్తున్నారు. భయంతో సైబర్‌నేరగాళ్లు వేసిన వలకు చిక్కుతున్నారు. ఆ తరువాత ఇంటర్వ్యూ అంటూ బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి.. బాధితుల బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు.
భయపడితే.. అంతే..!
ఏ పోలీసు అధికారైనా.. మీరు నేరం చేశారంటూ స్కైప్, వాట్సాప్‌లో విచారణ చేయాలంటూ అడగరు. గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమంటూ చెప్పుకొని.. ఇంటర్వ్యూ చేస్తామంటే భయపడకుండా ఫోన్ కట్ చేయండి.. వాళ్లు చేసేది ఏమి ఉండదు.. భయపడే వారినే భయపెట్టిస్తారు.. తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఉండాలి.. సైబర్‌నేరగాళ్లు పోలీసుల వేషంతో పెట్టే ఒత్తిడికి చాలా మంది తలొగ్గడం ఆందోళన కలిగిస్తున్నది. సీబీఐ అధికారులమంటూ వీడియో కాన్ఫరెన్స్‌లోకి వచ్చి.. ఇతర మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అక్కడ పెట్టి క్లోజ్ చేయండంటూ సూచిస్తున్నారు. మీ ఆధార్‌కార్డు ఇవ్వండి, మీ బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వండి.. అన్ని తనిఖీ చేస్తున్నామంటూ.. సినీ ఫక్కీలా హడావుడి చేస్తుంటారు.
మేం చెప్పినట్లు మీరు సహకరించకపోతే వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేసి ఢిల్లీ, ముంబైకి తరలించాల్సి వస్తుంది.. అంటూ బెదిరిస్తున్నారు. ఇప్పుడే సీబీఐ హెడ్‌క్వార్టర్స్ నుంచి హైదరాబాద్‌లో ఉండే సీబీఐకి సమాచారమిస్తాం.. వాళ్లు మీ ఇంటికి అరగంట వ్యవధిలోనే వచ్చేస్తారు.. అందరి ముందు మీ అక్రమ దందాలు బయటపెడతారని బెదిరిస్తారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక కొందరు మదనపడుతున్నారు. ఈ సమయంలోనే కొందరు బాధితులు వారి బ్యాంకు ఖాతాలన్నీ సైబర్‌నేరగాళ్ల చేతికి ఇచ్చి మోసపోతున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రతిరోజు ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.
అందరూ దొంగలే..
మీ పేరుతో వచ్చిన పార్సిళ్లు కొరియర్స్‌లో డ్రగ్స్.. ఇతర నిషేధిత వస్తువులు వెళ్తున్నాయి.. వచ్చాయి.. అంటూ ఎవరైనా ఫోన్ చేస్తే.. మీ ఇష్టం మొచ్చింది చేసుకోండి.. మాకు సంబంధం లేదు.. అని చెబుతూ.. తేలికగా తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. మీ వెంటపడి ఫోన్ చేసేవారి నంబర్లను బ్లాక్ చేయాలని, ఇంటర్వ్యూల పేరుతో వీడియో కాల్స్ చేస్తే తేలికగా తీసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. వాళ్లు పోలీసులు కారని, దొంగలని గుర్తించుకొని.. ధైర్యంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

