run for jesus | జూబ్లీహిల్స్, ఏప్రిల్ 19: యేసు పునరుత్థానుడయ్యాడు.. రండి చూద్దాం.. పరుగెత్తి.. ఎలుగెత్తి చాటుదాం.. అంటూ క్రైస్తవ సోదరులు శనివారం నాడు నగరవ్యాప్తంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. 2025 ఏండ్ల క్రితం జన్మించి, ముప్పైమూడున్నర ఏండ్లు జీవించి శుభ శుక్రవారం నాడు సిలువలో మరణించిన ఏసు.. మరణాన్ని జయించి మూడో రోజు ఆదివారం తెల్లవారుజామున లేచి తనను ప్రేమించిన వారికి, తన శిష్యులకు కనిపించి వారితో మాట్లాడారని చెబుతుంటారు.
అయితే జీసస్ సమాధిని గెలిచి బయటకు వచ్చాడని, ఒకరికి ఒకరు చెప్పుకోవడానికి క్రైస్తవులు సంప్రదాయం ప్రకారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఆరాధన టీవీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని చర్చిల క్రైస్తవులు సమైక్యంగా కలిసి పాల్గొన్నారు.