ఈయూకి జై కొట్టిన ఆర్టీసీ కార్మికులు.. కాంగ్రెస్‌కు దిమ్మతిరిగేలా తీర్పు
కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా ఆర్టీసీ కార్మికులు తీర్పునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆర్టీసీ కార్మికులు ఒక్కతాటిపైకి వచ్చి ఈయూ కూటమికి అండగా నిలిచారు. తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం స్పష్టించింది. ఆర్టీసీ ఎన్నికల చరిత్రలోనే తొలిసారి గ్రేటర్‌లోని 26 డిపోల్లో 23ను క్లీన్‌స్వీప్ చేసి విజయ దుందుభి మోగించి రికార్డు సృష్టించారు. అందులో భాగంగానే ఈయూ కూటమి విజయం దృష్ట్యా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్‌భవన్ ఎదుట ఆర్టీసీ కార్మికులు శనివారం ఘనంగా సంబురాలు జరిపారు.
- పనిచేయని సర్కార్ ప్రలోభాలు చరిత్రలో తొలిసారిగా గ్రేటర్లో 26కు 23 క్లీన్‌స్వీప్!
- బస్ భవన్ ఎదుట ఈయూ కూటమి సంబురాలు
- రాష్ట్ర వ్యాప్తంగా తరలొచ్చిన కార్మికులు
- కార్మికులంతా తమ పక్షమే నిలిచారన్న జేఏసీ నేతలు థామస్‌రెడ్డి, వెంకన్న
చిక్కడపల్లి, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు తరలొచ్చి సంతోషాన్ని పంచుకున్నారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలో 12 సంఘాలు మూడు కూటములుగా ఏర్పడి బరిలో నిలిచాయి. ప్రధానంగా టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ కలిసి ఒక కూటమిగా బరిలో నిలిచి విజయదుందుభి మోగించింది. ప్రత్యర్థి వర్గం తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, స్టాఫ్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ కూటమిని చిత్తు చేశారు. కాగా, ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోటీలో నిలిచిన ఈయూ కూటమి గెలవడంతో కార్మికులంతా సంబురాలు చేసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలకు 77 డిపోలలో ఘన విజయం సొంతం చేసుకొని సర్కార్‌కు షాకిచ్చారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మియాపూర్, రాణిగంజ్, మేడ్చల్ మినహా మిగిలిన 23 డిపోల్లో కార్మిక ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలిచారు. గ్రేటర్ హైదరాబాద్ గెలుపు తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే ఇది తొలిసారి అని యూనియన్ నాయకులు చెప్పారు. కాగా, పోస్టల్ బ్యాలెట్లో 980 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఫలితాలతో అధికారికంగా ఈనెల 17న ఫలితం ప్రకటన రానుంది. బస్సు భవన్ వద్ద జరిగిన సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకుడు థామస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఈయూ కూటమి సునామి సృష్టించిందన్నారు.
5వేల మెజార్టీతో బస్సు గుర్తు ముందంజలో ఉందన్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ 5 జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, హైదరాబాద్ గెలిచిందన్నారు. తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం వేరే సంఘాలను బరిలో దింపిందన్నారు. కోట్ల రూపాయలు, మద్యం అందించినా ప్రభుత్వ వ్యతిరేకతను ఆపలేకపోయారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే మా జేఏసీనే కార్మికులు ఎన్నుకున్నారన్నారు. ప్రభుత్వంపై తమ హక్కుల కోసం పోరాడే శక్తి తమకే ఉందన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమన్నారు.
ప్రభుత్వమేమో ఎన్నికలు నిర్వహిస్తాం..గెలిచిన వారినే కమిటీలో పెడతామని మాటిచ్చింది. కాబట్టి తమను కమిటీలో నియమించాలన్నారు. అనంతరం జేఏసీ నాయకుడు వెంకన్న మాట్లాడుతూ.. గ్రేటర్లో 26 ఉంటే 23 డిపోల్లో గెలిచామని, ఇది ఆర్టీసీ చరిత్రలోనే తొలిసారి అని చెప్పారు. ప్రభు త్వం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా కార్మికులు తమ జేఏసీని గెలిపించారన్నారు. విలీనం చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు సత్యం, రాజేశ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Congress
- EU
- Rally
- RTC workers
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

