దమ్ముంటే పట్టుకోండి
“అయిపోయిందన్న ఆట.. ఖతమైపోయింది వాని పని.. చచ్చిపోయిండు వాడు.. పోలీసులేం చేస్తరు.. దమ్ముంటే పట్టుకోమను.. దొరికింది ఛాయిస్.. ఏసేసిన.. డీఎస్సార్ ఖత మ్ హోగయా.. చచ్చిపోయిండాడు..” అంటూ ఒక హత్యచేసి వచ్చిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి తన స్నేహితులతో నవ్వుకుంటూ నిందితుడు అఫ్రోజ్ చెప్పిన మాటలివి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది.
- పోలీసులకు సవాల్ విసిరిన నిందితుడు
- మీర్‌పేటలో రౌడీషీటర్ సూరి దారుణహత్య
సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): “అయిపోయిందన్న ఆట.. ఖతమైపోయింది వాని పని.. చచ్చిపోయిండు వాడు.. పోలీసులేం చేస్తరు.. దమ్ముంటే పట్టుకోమను.. దొరికింది ఛాయిస్.. ఏసేసిన.. డీఎస్సార్ ఖత మ్ హోగయా.. చచ్చిపోయిండాడు..” అంటూ ఒక హత్యచేసి వచ్చిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి తన స్నేహితులతో నవ్వుకుంటూ నిందితుడు అఫ్రోజ్ చెప్పిన మాటలివి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన సూరి హత్య కలకలం రేపింది. పాతనేరస్తుడైన నందనవనం ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ సూరి ప్రత్యర్థుల చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. మీర్‌పేటలోని టీకేఆర్ కళాశాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాతకక్షల నేపథ్యంలో మాజీ రౌడీ షీటర్ సల్మాన్ సోదరుడు అఫ్రోజ్.. సూరిని పథకం ప్రకారం హతమార్చాడు. గతంలో తన భార్యతో పాటు బావమరిది సల్మాన్ హత్యకేసుల్లో నిందితుడుగా జైలుకు వెళ్లి వచ్చాడు. అతని నేరచరిత్రను దృష్టిలో పెట్టుకుని కొన్ని నెలల క్రితమే సూరిని పోలీసులు నగరబహిష్కరణ చేశారు.
స్నేహం పేరుతో సూరికి దగ్గరై..
సూరిని ఎలాగైనా చంపేయాలని కక్ష పెంచుకున్న అఫ్రోజ్ అతనితో స్నేహం చేస్తున్నట్లు నటించాడు. ఈక్రమంలో సూరి తన రెండోభార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకల కోసం నందనవనానికి రావడంతో ప్లాన్ ప్రకారం అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి అనంతరం కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. తీవ్రగాయాల పాలైన సూరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సూరిపై హైదరాబాద్‌తో పాటు వరంగల్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే హత్య చేసిన అనంతరం అఫ్రోజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సూరిని తానే హత్యచేశానంటూ స్నేహితులకు చెబుతూ దొరికాడు..చంపేశాను అంటూ చెప్పి పోలీసులు పట్టుకుంటే ఎట్లా అంటే పోలీసులకు దమ్ముంటే పట్టుకోమంటూ సవాల్ విసిరాడు.
రంగంలోకి ప్రత్యేక బృందాలు..
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్‌తో పాటు ఈ ఘటనలో పాల్గొన్న ఇతర వ్యక్తుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలిస్తున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో సవాల్ విసిరిన అఫ్రోజ్ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ఈ వీడియో తమ దృష్టికి రాలేదని చెప్పారు. అసలు ఆ వీడియోలో ఏముంది.. ఎవరెవరు ఉన్నారంటూ పోలీసులు ఆరా తీశారు. అఫ్రోజ్ మాత్రం తనను ఎవరూ పట్టుకోలేరని, పోలీసులకు దమ్ముంటే తనను పట్టుకోవాలని, అనుకున్నట్లుగానే సూరి చచ్చిపోయాడంటూ వ్యాఖ్యలు చేయడం పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

