చెక్కుచెదరని రికార్డు.. 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య పేరిట బోలడన్ని రికార్డులు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక స్థాయిలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య పేరిట ఉంది. ఆయన మొత్తం 16 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దాంట్లో ఆర్థిక మంత్రిగా 15 సార్లు ప్రవేశపెట్టగా.. ఒకసారి సీఎంగా ఆయన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ రికార్డును నెలకొల్పిన నేత కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఎవరూ లేరు.
అసాధారణ ట్యాలెంట్ ఉన్న రాజకీయవేత్తగా రోశయ్యకు గుర్తింపు ఉంది. ఇక ఆయన మాట్లాడితే ఎదుటివారు ఖంగుతినాల్సిందే. అద్భుతమైన మాటకారి అన్న ఐడెంటిటీ కూడా రోశయ్యకు ఉంది. ఛలోక్తులు, చమత్కారాలు వేయడంలోనూ రోశయ్య దిట్ట. నిజానికి గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్ ఫేమస్. కానీ రోశయ్య మాత్రం తాను పనిచేసిన అందరు సీఎంలతో కలిసిమెలిసి ఉన్నారు. చాలా షార్ప్‌గా లాజిక్‌గా మాట్లాడుతూ.. అసెంబ్లీలో రోశయ్య సభ్యుల్ని అట్రాక్ట్ చేసేవారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని గట్టెక్కించే సత్తా కలిగిన నేతగా రోశయ్య ఎదిగారు.
ఏపీ బడ్జెట్‌ను 16 సార్లు ప్రవేశపెట్టిన ఆయన.. ఓ దశలో వరుసగా ఏడు సార్లు బడ్జెట్‌ను సమర్పించారు. 1980 దశకంలో శాసనమండలి సభ్యుడిగా కొనసాగారు. అయితే 1984లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మండలిని రద్దు చేశారు. మండలిలో రోశయ్యను ఎదుర్కోలేకనే.. ఎన్టీఆర్ మండలిని రద్దు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తుంటాయి. ఉమ్మడి ఏపీ సీఎంగా చేసిన రోశయ్య.. ఇవాళ హైదరాబాద్‌లో కన్నుమూశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

