హైదరాబాద్ : జీహెచ్ఎంసీ బడ్జెట్(GHMC budget) సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. మంగళవారం పన్నుల వసూళ్లపై కౌన్సిల్లో కార్పొరేటర్లు చర్చను లేవనెత్తారు. పన్నుల వసూళ్లపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్(Ronald Ross) వివరణ ఇచ్చారు. చట్టప్రకారమే నగరంలో పన్నులు వసూలు చేస్తున్నామని తెలిపారు.
ఓయో వ్యాపారంపై విచారణ చేసి పన్నులు వసూలు చేస్తామని ఆయన తెలిపారు. అలాగే సెల్లార్ పార్కింగ్‌పై పోలీస్, జీహెచ్ఎంసీ కలిసి సర్వే చేస్తామన్నారు. కాగా, నిన్నటి సమావేశాల్లో ప్రకటనలపై పూర్తి నివేదిక ఇవ్వాలని కమిషనర్‌కు మేయర్ గద్వాల విజయలక్ష్మి(Mayor Vijayalakshmi ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.