R Krishnaiah | రేవంత్‌రెడ్డిది ప్రజా ప్రభుత్వం కాదు.. కమీషన్ల ప్రభుత్వం : ఆర్ కృష్ణయ్య
R Krishnaiah | సీఎం రేవంత్‌రెడ్డిది ప్రజా ప్రభుత్వం కాదని, కమీషన్ల ప్రభుత్వమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు.
కాచిగూడ ( సికింద్రాబాద్) : సీఎం రేవంత్‌రెడ్డిది ప్రజా ప్రభుత్వం కాదని, కమీషన్ల ప్రభుత్వమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R Krishnaiah ) ఆరోపించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లుట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాచిగూడలోని అభినందన్ హోటల్లో బీసీ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీలకు అన్యాయం చేస్తే రేవంత్‌రెడ్డి (Revanth reddy) ప్రభుత్వాన్ని తరిమికొడతామని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీ కార్పొరేషన్ (BC Corporations) ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు 90 శాతంతో సబ్సిడీ రుణాలను ఇచ్చి, మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 కుల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని, ప్రతి కార్పొరేషన్‌కు చైర్మన్, పాలకమండళ్ల సభ్యులను ఏర్పాటు చేయాలని సూచించారు. మారుతున్న సమాజంలో బీసీలు ఆర్థికంగా ఎదగడానికి బీసీ కార్పొరేషన్ ద్వారా నిరంతరం రుణాలు అందజేయాలని కోరారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలకు సొంత భవనాలకు నిర్మించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. ! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

