కల్లు కాంపౌండ్‌పై కన్నెర్ర
ప్రేమ్‌నగర్‌లో అనధికార కల్లు కాంపౌండ్ ఏర్పాటుపై బస్తీ వాసులు భగ్గుమన్నారు. కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేసే ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసనకు దిగారు. ఎన్వోసీ లేకుండానే ఎక్సైజ్ శాఖ ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. బస్తీ మధ్యలో జనావాసాలు, ఆలయాల సమీపంలో కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమన్నారు.
- ప్రేమ్‌నగర్‌లో అనధికారి కల్లు కంపౌండ్
- బస్తీవాసులు, బీఆర్ఎస్ నేతల నిరసన
ప్రేమ్‌నగర్‌లో అనధికార కల్లు కాంపౌండ్ ఏర్పాటుపై బస్తీ వాసులు భగ్గుమన్నారు. కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేసే ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసనకు దిగారు. ఎన్వోసీ లేకుండానే ఎక్సైజ్ శాఖ ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. బస్తీ మధ్యలో జనావాసాలు, ఆలయాల సమీపంలో కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమన్నారు.
-ఖైరతాబాద్
ఖైరతాబాద్, మే 9 : బంజారాహిల్స్ డివిజన్ ప్రేమ్‌నగర్‌లో అనధికార కల్లు కంపౌండ్ ఏర్పాటుపై స్థానిక బస్తీ వాసులు భగ్గుమన్నారు. ఈ మేరకు కల్లు కంపౌండ్ ఏర్పాటు చేసే ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసనకు దిగారు. పోలీసులు బస్తీవాసులకు నచ్చచెప్పే ప్రయత్నం చేయగా, వారితో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత జేజోల్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ ప్రతిపాదిత కల్లు కంపౌండ్ స్థలం సాయిబాబా ఆలయానికి కేవలం 90 మీటర్ల దూరంలో ఉందని, ప్రతి రోజూ మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తుంటారని తెలిపారు.
ఈ నేపథ్యంలో కల్లు సేవించిన వారితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఎన్వోసీ లేకుండానే ఎక్సైజ్ శాఖ ఎలా అనుమతులు ఇస్తుందని ప్రశ్నించారు. బస్తీ మధ్యలో జనావాసాలు, ఆలయాల సమీపంలో కల్లు కంపౌండ్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమన్నారు. ప్రతిపాదిత కల్లు కంపౌండ్‌ను తక్షణమే రద్దు చేయాలని లేదా నివాస, ఆధ్యాత్మిక ప్రాంతాలకు దూరంగా తరలించాలని కోరారు. ఈ మేరకు స్థానిక నేతలు శ్రీధర్‌యాదవ్, నవీన్ కొప్పుల, బస్తీవాసులతో కలిసి ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ కార్యాలయాల్లో ఫిర్యాదులు అందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

