జూబ్లీహిల్స్, జూన్ 20: జీహెచ్ఎంసీ 19వ సర్కిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాల్‌రాజ్ పై దాడికి యత్నించిన రహ్మత్‌నగర్ కార్పొరేటర్ సీఎన్రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ బల్దియా కమిషనర్ ఆర్ వీ కర్ణన్‌కు వినతిపత్రం సమర్పించారు. యూసుఫ్‌గూడలోని సర్కిల్ కార్యాలయంలో విధుల్లో ఉన్న ఏఎంసీ బాల్ రాజ్ పై కార్పొరేటర్, అతని అనుచరులు దాడికి యత్నించిన ఘటనలో ఇప్పటికే స్థానిక మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాగా, శాఖా పరమైన విచారణకు ఇప్పటికే జోనల్ కమిషనర్ హేమంత్‌కు వినతి పత్రం ఇచ్చిన ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు జీ హెచ్ఎం సీ కమిషనర్‌కు కూడా వినతి పత్రం సమర్పించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులపై, అధికారులపై దాడులు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఏఎంసీ బాల్ రాజ్ కోరారు.