అత్తాపూర్ : కాలనీల సంక్షేమ సంఘాల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అన్నారు. బుదవారం అత్తాపూర్ డివిజన్లోని ఆదివాసీ తోటి బస్తీ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కలిసి తమ బస్తీలో శిథిలావస్థకు చేరుకున్న కమ్యునిటీహాల్ను పునః నిర్మించాలని వినతి పత్రం సమర్పించారు.
కమ్యునిటీహాల్ లేకపోవంతో స్థానికంగా చిన్న చిన్న కార్యక్రమాలకు ఇబ్బందులు కల్గుతున్నాయని 30ఏళ్ళ క్రితం నిర్మించిన కమ్యునిటిహాల్ ఉపయోగకరంగా లేదని ఎమ్మెల్యేకు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. అత్తాపూర్ తోటి బస్తీలో కమ్యునిటి హల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. బస్తీలు, కాలనీలలో స్థలాలు అనుకూలంగా ఉంటే కమ్యునిటీ హాల్‌లను నిర్మించేందుకు కృషిచేస్తానని ఆయన తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో కమ్యునిటీభవనాలు నిర్మించామని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డిజిల్లా టిఆర్‌యస్ పార్టీ నాయకులు మిద్లె సురేందర్‌రెడ్డి, అమరేందర్, జీహెచ్ఎంసీ వార్డు కమిటి సబ్యుడు సురేష్‌రెడ్డి, టిఆర్యస్వీ గ్రేటర్ కోఆర్టీనేటర్ శ్రీదర్‌రెడ్డి, ఆదివాసీతోటి బస్తీ కాలనీ సంక్షమం సంఘం అధ్యక్షుడు సోయం ప్రభాకర్, ఉపాదక్షుడు గుర్రం జ్ఞానేశ్వర్; ప్రధానకార్యదర్శి ఆత్రం గోవింద్, నాయకులు పియం రెడ్డి, శ్రీదర్‌రెడ్డి, శివశంకర్, అర్జున్‌రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.