e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home క్రైమ్‌ బ్లాక్‌లో రెమిడెసివర్‌... ముగ్గురి అరెస్టు

బ్లాక్‌లో రెమిడెసివర్‌… ముగ్గురి అరెస్టు

బ్లాక్‌లో రెమిడెసివర్‌...  ముగ్గురి అరెస్టు

వేర్వేరు చోట్ల రెమిడెసివర్‌ ఇంజక్షన్‌లను అధిక ధరకు ముగ్గురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జశ్వంత్‌ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుండగా.. ఓ ప్రైవేట్‌ దవాఖానలో పని చేస్తున్న మహిళ వద్ద నుంచి రెమిడిసివర్‌ ఇంజక్షన్లను తక్కువ తక్కువ ధరకు తీసుకుని అవసరం ఉన్న వారికి 30 వేలకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు సరూర్‌నగర్‌ పోలీసుల సహాయంతో జశ్వంత్‌ను అరెస్టు చేశారు. ఇక కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన వేణుమాధవన్‌ ప్రైవేటు ఉద్యోగి. దవాఖానల్లో పని చేసే వారి నుంచి సేకరించి వాటిని 34 వేల రూపాయాలకు విక్రయిస్తుండగా సమాచారం తెలుసుకున్న హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పశ్చిమ మండలం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అలాగే.. రామంతాపూర్‌ డివిజన్‌ గణేశ్‌నగర్‌కు చెందిన గధ రాజేశ్‌ అనే ప్రైవేట్‌ ఉద్యోగి కొంత కాలంగా మెడికల్‌ షాప్‌లో పనిచేస్తున్నాడు. మార్కెట్‌లో కొరత ఉండటంతో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్స్‌ను బ్లాక్‌లో విక్రయిస్తున్నాడు. శనివారం రాధిక చౌరస్తాలోని తాతా అసుపత్రి వద్ద ఇంజక్షన్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి రాజేశ్‌ను అరెస్టు చేశారు. ఈ ముగ్గురి వద్ద 8 ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బ్లాక్‌లో రెమిడెసివర్‌...  ముగ్గురి అరెస్టు

ట్రెండింగ్‌

Advertisement