శంషాబాద్ రూరల్ : 108 ఉద్యోగి సేవలను గుర్తించి స్థానిక ఆసరా సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రవి గతకొంత కాలం నుంచి శంషాబాద్ మండలంలో108 అంబులెన్స్‌లో ఫైలెట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తన విధి నిర్వాహణలో భాగంగా ఆపదలో ఉన్నవారిని తక్కువ సమయంలో ఆసుపత్రికి తరలించి వారికి వైద్యసేవలు అందే విధంగా కృషి చేస్తున్నాడు. ప్రమాదస్ధాయిని బట్టి అవసరమైన ప్రథమ చికిత్సను అందిస్తూ పలువురి ప్రాణాలు రక్షించాడు. కాగా ఆయన సేవలను గుర్తించిన ఆసరా సంస్థ ప్రతినిధులు రవిని ఘనంగా సత్కరించారు.