చాంద్రాయణగుట్ట,ఆగస్టు 20 : రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..ఛత్రినాక జయప్రకాష్ నగర్లో నివసించే రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవులపల్లి నవీన్‌కుమార్ (42), జూన్ 18వ తేదీన వ్యాపారం కోసం బయటకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.
అనంతరం మూడు రోజులు అయిన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి అదే నెల 21వ తేదీన ఫోన్ చేసి క్షేమ సమాచారం అడగ్గా తను నంద్యాలలో ఉన్నట్లు తెలిపాడు. ఆ తరువాత కూడా ఇంటికి రాకపోవడంతో పలుమార్లు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్వీచ్ ఆఫ్ వచ్చింది. దీంతో తెలిసిన వారికి ఫోన్ చేసినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న ఛత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.