బంజారాహిల్స్,మే 24: ఆర్డీవోల సంతకాలు ఫోర్జరీ చేసి అలాట్మెంట్ లెటర్లు తయారు చేశాడు. వాటిని చూపించి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. తక్కువ ధరకు డబుల్బెడ్రూమ్ ఇండ్లు వచ్చాయన్న ఆనందంతో అక్కడకు వెళ్లి చూడగా బోగస్ అని తేలింది. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలు.. ఒడిశాకు చెందిన సంకర్షన్ దాస్ ్త శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉంటూ ప్లంబర్‌గా పనిచేస్తుంటాడు.
గతంలో బంజారాహిల్స్‌రోడ్ నెం 2లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్లంబింగ్ పనులు చేస్తున్నప్పుడు అక్కడ ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా జానాపల్లికి చెందిన నాగరాజు రెడ్డితో పరిచయం ఏర్పడింది. తనకు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని, గత ప్రభుత్వంలో నిర్మించిన కొన్ని డబుల్ బెడ్రూమ్లను ఇప్పిస్తానని నమ్మబలికారు. దీనికోసం ప్రసాద్ ల్యాబ్స్‌లో రూ.2.50లక్షలు తీసుకున్న నాగరాజు రెడ్డి బోగస్ అలాట్మెంట్ లెటర్‌ను అందించారు.
సంకర్షన్దాస్తో పాటు మరికొంతమంది స్నేహితులు కలిసి మొత్తం రూ.17 లక్షలదాకా నాగరాజురెడ్డికి అందజేశారు. వారందరికీ అలాట్మెంట్ లెటర్లు ఇవ్వగా వాటిని తీసుకుని డబుల్బెడ్రూమ్ ఇండ్లవద్దకు వెళ్లగా అవి బోగస్ అని తేలింది. రాజేంద్రనగర్, మల్కాజిగిరి ఆర్డీవో సంతకాలను ఫోర్జరీ చేసి బోగస్ లెటర్లు ఇచ్చినట్లు తేలింది. వాటిని తీసుకుని సంబంధిత ఆర్డీవోలను కలవగా తాము ఎలాంటి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదని స్పష్టం చేశారు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నాగరాజు రెడ్డితో పాటు పలువురి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.