హైదరాబాద్ : ఇటీవల నూతనంగా విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన రావుల శ్రీధర్ రెడ్డి వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు ఆధిరోహించాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కూడా ఉన్నారు.