Ravula Sridhar | కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్న రేవంత్ రెడ్డి : రావుల శ్రీధర్
Ravula Sridhar | ప్రైవేట్ స్కూళ్ల లక్ష్యం, ప్రభుత్వ స్కూళ్ల లక్ష్యం ఒకటే కాదని ముఖ్యమంత్రి గమనించాలి. ప్రైవేట్ స్కూళ్లు పెట్టుకునే వాళ్లు వ్యాపార ధోరణితో పనిచేస్తారు. లాభాలు ఆర్జిస్తారు. కానీ ప్రభుత్వ స్కూళ్ల లక్ష్యం వ్యాపార ధోరణి కాదు.. అది మీ బాధ్యత. విద్యను అందరికి చేరవేయడమన్నారు బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్..
Ravula Sridhar | తానే విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి.. అయినా పేద, మధ్యతరగతి పిల్లల విద్యాహక్కులను కాలరాస్తూ… ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ ఆరోపించారు.
ఈ విషయమై ఆయన తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మాట మాట్లాడితే ప్రైవేట్ స్కూళ్ల గురించి రెఫర్ చేస్తూ అక్కడ 2 వేల మంది చదువుతలేరా.. 3 వేల మంది చదువుతలేరా..అని అంటడు. ప్రైవేట్ స్కూళ్ల లక్ష్యం, ప్రభుత్వ స్కూళ్ల లక్ష్యం ఒకటే కాదని ముఖ్యమంత్రి గమనించాలి. ప్రైవేట్ స్కూళ్లు పెట్టుకునే వాళ్లు వ్యాపార ధోరణితో పనిచేస్తారు. లాభాలు ఆర్జిస్తారు. కానీ ప్రభుత్వ స్కూళ్ల లక్ష్యం వ్యాపార ధోరణి కాదు.. అది మీ బాధ్యత. విద్యను అందరికి చేరవేయడమన్నారు.
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్‌లో చాలా క్లియర్‌గా ఉంటది. విద్యను కల్పించాలని అని రావుల శ్రీధర్ అన్నారు. ఎక్కడ కూడా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు ఖర్చులు సంబంధం లేకుండా నిర్వహించాలని చెప్తరు. అదేం లేకుండా గతంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు కొన్ని రేషనలైజ్ చేస్తే కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలు తీసేస్తరా.. అట్లా ఎట్లా చేస్తరని మాట్లాదిన రేవంత్ రెడ్డి.. ఇవాళ ప్రభుత్వంలోకి రాగానే ఆయన విద్యా మంత్రిగా ఉండి తండాల్లో, గూడాల్లో స్కూళ్లు ఉండటమనేది ఓల్డ్ ప్యాషన్ అట. అది ఔట్‌డేటెడ్ ప్యాషన్ కాదు మిత్రమా.. మీ ఆలోచనలు ఔట్డేటెడ్గా ఉన్నాయి. మీకు విద్యా వ్యవస్థ మీద కనీస అవగాహన లేదు.. సమాజం పట్ల బాధ్యత లేదనే విషయాన్ని ఈ ప్రకటనలు మాకు గుర్తు చేస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో 26, 066 ప్రభుత్వ పాఠశాలున్నాయి. దాంటంలో కొన్ని ఎయిడెడ్ స్కూళ్లున్నాయి. దాంట్లో భాగంగానే 4500 హైస్కూళ్లున్నాయి. ఉపాధ్యాయ సంఘాలున్నాయి. నిపుణులున్నారు.. విద్యారంగంలో దగ్గరగా పని చేసే వ్యక్తులున్నారు. మీరు బెంగళూరులో మాట్లాడే ముందుకు ఎవరితోనైనా చర్చించారా..? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి దీంట్లో మరో విషయం ఉందా.. అన్నారు. రేషనలైజ్ చేయడమంటే సంఖ్య తగ్గించడం కాదనే విషయాన్ని సీఎం గమనించాలి. ఒకవేళ స్టూడెంట్ -టీచర్ రేషియా మెయింటైన్ కాకపోతే కొన్ని చోట్ల తలకు మించిన భారమనుకుంటుంటే దాంట్లో కొద్దో గొప్పో మార్పులు చేసుకుంటం.. అంతేకానీ క్లస్టర్లు చేస్తామనడం సరికాదన్నారు.
తానే విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి..
అయినా పేద, మధ్యతరగతి పిల్లల విద్యాహక్కులను కాలరాస్తూ…
ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాడు రేవంత్ రెడ్డి.– బీఆర్ఎస్ నాయకులు @RSRBRS pic.twitter.com/0LptUy5wkv
— BRS Party (@BRSparty) June 9, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

