FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
FMG Doctor | సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. 15 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎఫ్ఎంజీ వైద్యులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్లలోకి ఎక్కించిన వీడియో కూడా నెట్టింట రౌండప్ చేస్తోంది.
FMG Doctor | సుప్రీంకోర్టు తమకు రూ.29 వేలు స్టైఫండ్ ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినా, తెలంగాణ ప్రభుత్వం కేవలం రూ.5 వేలు మాత్రమే ఇస్తుందని ఎఫ్ఎంజీ (FMG) వైద్యులు కోఠి DME కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారని తెలిసిందే. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. 15 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎఫ్ఎంజీ వైద్యులను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.
పోలీసులు నిరసనలోపాల్గొన్న వైద్యులను బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్లలోకి ఎక్కించిన వీడియో కూడా నెట్టింట రౌండప్ చేస్తోంది. కాగా నిరసనలో పాల్గొన్న FMG ఇంటర్న్‌షిప్ డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. నా ఇంటర్న్‌షిప్ మొదలై 4 నెలలవుతుంది.. నెలకు రూ.5 వేలు అంటున్నారో.. ఆ 4 నెలల్లో ఒక్క నెల కూడా రూ. 5 వేలు కూడా నాకు ఇంతవరకు పడలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
మా సీనియర్లు జాయిన్ అయి 8 నెలలు అవుతుంది. వాళ్లకు ఒక్క నెల కూడా రూ.5 వేలు పడలేదు. 25, 27 ఏండ్ల వయస్సు వచ్చినంక కూడా ఇంకా ఫ్యామిలీ నుంచే మనీ రావాలి అంటే ఎవరికైనా ఇబ్బందే. మేము కూడా ఊరికే అడగలేం. గవర్నమెంట్ అందరికీ ఇచ్చినట్టుగా మాకు కూడా ఇస్తే ఇలా ఉండదు కదా.. మేం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మేం సమానంగానే పని చేస్తున్నాం. రాజస్థాన్‌లో కూడా ఇలానే ఆందోళన చేశారు. వాళ్లకు 15 రోజుల్లోనే సమాధానం దొరికింది. వాళ్లకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది. జీవో కూడా పాసయింది.. ఇంప్లిమెంట్ కూడా అయిపోయిందని స్పష్టం చేసింది.
జమ్మూకశ్మీర్‌లో 2 రోజుల్లోనే గవర్నమెంట్ వచ్చి చెప్పింది. మన దగ్గర ఎందుకు ఇంత ఆలస్యం..కనీసం ఇస్తారా..? రెస్పాండ్ అయినా అవ్వాలి కదా..అయినా కూడా మేం శాంతియుతంగానే ఆందోళన కొనసాగిస్తున్నాం. ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు లేకుండానే మేం డీఎంఈ ఆఫీస్ దగ్గర నిరసన తెలుపుతున్నాం. కానీ మమ్మల్ని ఇప్పటికీ నిర్బంధించారు. ఎక్కడ సరిపోతయి ఆ 5 వేల రూపాయలు అవి కూడా సరిగా పడటం లేదు.. మాకు కావాల్సింది.. వచ్చేదే రూ.30 వేలు.. ఎందుకు 5 వేల రూపాయలు వేస్తరని కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించింది.
ప్రభుత్వం మాకు రూ.5000 స్టైఫండ్ కూడా ఇవ్వడం లేదు
సుప్రీంకోర్టు రూ.30,000 స్టైఫండ్ ఇవ్వాలని తీర్పునిస్తే దాన్ని పట్టించుకోకుండా రూ.5000 ఇస్తామని ఈ ప్రభుత్వం అన్నది
నేను నాలుగు నెలల నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నా.. నాలుగు నెలల నుండి కనీసం ఆ రూ.5000 స్టైఫండ్ కూడా ఇవ్వడం లేదు
– FMG ఇంటర్న్‌షిప్ డాక్టర్
— Telugu Scribe (@TeluguScribe) October 24, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

