Hyd Rains | హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల వర్షం కురిసింది. అమీర్‌పేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, ఎస్ఆర్నగర్, మధురానగర్, కోఠిలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం పడింది. పంజాగుట్ట, బషీర్‌భాగ్, అబిడ్స్, నారాయణగూడ, చంపాపేట, సరూర్‌నగర్, మలక్‌పేటలో ఈదురుగాలులతో వాన కురిసింది. సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, చిలుకలగూడ, మారేడ్పల్లితో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది.
గచ్చిబౌలిలో పలుచోట్ల వడగళ్లు కురిశాయి. ఇదిలా ఉండగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై పలుచోట్ల వర్షం నిలువడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పలుచోట్ల వాహనాలు నెమ్మదిగా కదిలాయి. పొద్దంతా ఎండలు, ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులుపడగా.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వాన కురవడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు.