Hyd Rains | హైదరాబాద్‌లో సోమవారం పలుచోట్ల వర్షం కురుస్తున్నది. తార్నక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నది. దిల్సుఖ్నగర్, మలక్‌పేట, ముషీరాబాద్, చంపాపేట, సైదాబాద్, సరూర్‌నగర్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంపేట, అబిడ్స్, చాంద్రయాణగుట్ట, ఫలుక్‌నుమా, చార్మినార్ వద్ద వర్షం పడుతున్నది. బహదూర్‌పుర, ఉప్పుగూడ, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, బోయిన్పల్లి, అల్వాల్, చిలకలగూడ, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేటలో వర్షంపడుతున్నది. ఒక్కసారిగా వర్షం కురవడంతో జనం ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదిలా ఉండగా.. రాగల మూడురోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.