Hyd Rain | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై.. వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వచ్చాయి. ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్లింగంపల్లి, రామ్నగర్, విద్యానగర్, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరిలో వర్షం కురిసింది. అల్వాల్, ప్యాట్నీ, ప్యారడైజ్, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతున్నది. పొద్దంతా ఎండలు దంచికొట్టాయి.
ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గత కొన్ని రోజులుగా నగరంలో భారీగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. శనివారం సాయంత్రం వాతావరణం మారిపోయి వాన కురిసింది. వాన కురవడంతో నగరం చల్లబడగా.. ఉక్కపోత నుంచి జనం ఉపశమనం పొందుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని దక్షిణం, నైరుతి దిశ నుంచి ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.