Rain Alert | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నది. జూబ్లీహిల్స్, బంజారాహిల్, సోమాజిగూడ, అమీర్పేట, సనత్నగర్, సికింద్రాబాద్, బేగంపేట, చిలగూడ, బోయినపల్లి, అడ్డగుట్ట, ప్యారడైజ్, ప్యాట్నీ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నది. తార్నాక, నాచారం, ఉప్పల్, మేడిపల్లి, నాంపల్లి, ఆబిడ్స్, కోఠి, అఫ్జల్గంజ్, ఖైరతాబాద్, అంబర్పేట, నల్లకుంట, కాచిగూడ, గోషామహల్, మలక్పేట, చాదర్ఘాట్ వాన కురుస్తున్నది.
దిల్సుఖ్నగర్, సరూర్నగర్, కొత్తపేట, రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, నార్సింగ్, అత్తాపూర్, గచ్చిబౌలి, హబ్సీగూడ, కూకట్పల్లి, బీరంగూడ, చందనానగర్ నుంచి కొండాపూర్తో పాలు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నది. వర్షం కారణంగా రోడ్లపై వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపు రాగల ఒకటి, రెండుగంటల్లో మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.