సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): సీసీ కెమెరాలో కనిపించిన నిందితుడి హెయిర్ స్టైల్ ఇచ్చిన క్లూతో చిలకలగూడలో జరిగిన చైన్‌స్నాచింగ్ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. చిలకలగూడలో 73 ఏండ్ల వృద్ధురాలి మెడలో నుంచి మంగళ సూత్రం స్నాచింగ్ చేసిన నిందితుడు హర్షవర్ధన్‌రెడ్డి రైల్వేలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అద్దెకు ఇండ్లు ఉన్నాయా.! అంటూ పద్మారావునగర్‌లో బాధితురాలిని అడిగాడు.
ఆమె ఇంటి ముందు నిలబడి ఉండగా మెడలో నుంచి గొలుసు లాక్కొని పారిపోయాడు. రంగంలోకి దిగిన చిలకలగూడ క్రైమ్ టీమ్ పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితురాలు కూడా నిందితుడికి సంబంధించిన సమాచారం ఇచ్చింది. సీసీ కెమెరాల నుంచి నిందితుడి ఆధారాలు సేకరించిన పోలీసులు.. అతడి జుట్టు కత్తిరింపు పోలీస్ మాదిరిగా ఉన్నదని గుర్తించారు. అతడు రైల్వే సిబ్బందిగా గుర్తించి పట్టుకున్నారు.