రవీంద్రభారతి, డిసెంబర్ 26 : పీవీ నరసింహారావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ ప్రజా కవి దివంగత కాళోజీ నారాయణరావుకు పీపీ మెమోరియల్ ఫౌండేషన్ ప్రకటించింది. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ సాంకేతిక నిపుణుడు పద్మశ్రీ డా.టి.హనుమాన్ చౌదరి, ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయ్‌బాబు, విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలలత, పీవీ మెమోరియల్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మాదంశెట్టి అనిల్‌కుమార్ పాల్గొని మాట్లాడారు.
పీవీ నరసింహారావు స్మారక పురస్కారాన్ని నరల్లమోతుల భాస్కర్‌రావుకు ఈ నెల 28న రవీంద్రభారతిలో అందజేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ సురభీ వాణీదేవి అమీర్ అలీఖాన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, సాంస్కృతిక శాఖ సారథి వెన్నెల గద్దర్ పాల్గొంటారని తెలిపారు.