మన్సూరాబాద్, ఫిబ్రవరి 3: గుండె పోటు వచ్చిన సమయంలో అత్యవసరంగా మొదట చేయవల్సిన ప్రాథమిక చికిత్స సీపీఆర్‌పై ప్రజ లు అవగాహన కలిగి ఉండాలని లోక్‌సత్తా వ్య వస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ తెలిపారు. గుండె పోటు సమయంలో అత్యవసరంగా చేపట్టే సీపీఆర్ ప్రథమ చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సా మాజిక కార్యకర్త దోసపాటి రాము ఆధ్వర్యం లో కోడ్ బ్లూ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సో మవారం ఆవిష్కరించారు. జయప్రకాష్ నా రాయణ మాట్లాడుతూ, సీపీఆర్ చేయడం ద్వారా మనిషి జీవితాన్ని కాపాడవచ్చనే సం ఘటనలు ఈ మధ్య కాలంలో అనేకం జరిగాయన్నారు. దీనికి సంబంధించి సామాజిక కా ర్యకర్తలు దోసపాటి రాము, యశస్విని జొన్నలగడ్డ కోడ్ బ్లూ పేరుతో చేపడుతున్న కార్యక్ర మం అభినందనీయమన్నారు. కార్పొరేట్, ప్రై వేటు దవాఖానల యాజమాన్యాలు ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి యువతకు సరైన శిక్షణను ఇస్తే ఇంటికి ఒక సీపీఆర్ వాలంటీర్‌ను తయారు చేయవచ్చునని తెలిపారు.