సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : బడాబాబులకు మేలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ క్యూర్ చట్టం-2026 తెచ్చిందన్నది తేలిపోయింది. ఆస్తి పన్ను మదింపులో ‘క్యూర్ మార్క్’ దగా అంటూ.. విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందల్లో ఉండే ఆస్తిపన్ను విషయంలో సామాన్యుడిని నానా ఇబ్బందులు పెట్టే అధికార యంత్రాంగం.. పెద్దల కొమ్ముకాస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో క్యాపిటల్ వాల్యూ (మూలధన విలువ) ప్రాతిపదికన సాగుతున్న స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) ప్రక్రియ గందరగోళంగా తయారమైంది.
ఆన్లైన్ సిస్టమ్‌లోని సాంకేతిక లోపాలు, జీఐఎస్ మ్యాపింగ్ వైఫల్యాలు సామాన్య జనానికి పెనుభారంగా మారింది. బడా వ్యాపారులు, వీఐపీలకు మాత్రం లక్షల రూపాయల పన్ను మినహాయింపు దక్కుతుండటం గమనార్హం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిలో (కమర్షియల్ ఆస్తి) చదరపు గజానికి మార్కెట్ విలువ సుమారు రూ. 1.16 లక్షలు ఉండగా, ఆన్లైన్లో సిస్టమ్స్‌లో రూ. 74వేలుగా చూపిస్తున్నారు. అంటే సంబంధిత యజమానికి ప్రత్యక్షంగా రూ. 42వేల లబ్ధి జరుగుతున్నది. జూబ్లీహిల్స్ వంటి అత్యంత ధనిక ప్రాంతంలో ఇలాంటి విచిత్రాలు జరుగుతుంటే, సాధారణ డివిజన్లు, బస్తీల్లో ఇంకెన్ని తప్పులు జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. ఈ సాంకేతిక అస్తవ్యస్తతను సరిదిద్దకపోతే.. ఆస్తిపన్ను అపీళ్లు, వివాదాలు చెలరేగడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
క్యూర్ చట్టం-2026 ద్వారా ట్రై కార్పొరేషన్ జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలో ఒకే తరహాలో ఆస్తిపన్ను విధానాన్ని ఆమలు చేస్తున్న ప్రభుత్వం.. ప్రారంభ దశలోనే బడాబాబులకు మేలు చేసేందుకు కొత్త చట్టం తీసుకువచ్చారన్నది తేలిపోయింది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో క్యాపిటల్ వాల్యూ (మూలధన విలువ) ప్రాతిపదికన సాగుతున్న స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) ప్రక్రియ ప్రస్తుతం గందరగోళంగా మారింది. ఆన్లైన్ సిస్టమ్‌లోని సాంకేతిక లోపాలు, జీఐఎస్ మ్యాపింగ్ వైఫల్యాలు సామాన్య పౌరులకు పెనుభారంగా మారుతుండగా, బడా వ్యాపారులు, వీఐపీలకు రాత్రికి రాత్రే లక్షల రూపాయల పన్ను మినహాయింపు దకుతోంది.
జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిలోని వాణిజ్య భవనాల ఆస్తిపన్ను ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉదాహరణకు జూబ్లీహిల్స్ ప్రధాన రహదారిలో కమర్షియల్ ఆస్తిని ఎంపిక చేసుకుంటే చదరపు గజానికి రూ.1.16 లక్షలుగా ఉండాల్సిన మార్కెట్ విలువకు బదులుగా రూ.74వేలుగా ఆన్లైన్ సిస్టమ్స్‌లో చూపిస్తున్నారు. అంటే సంబందిత యజమానికి ప్రత్యక్షంగా రూ. 42వేల లబ్ధి జరుగుతున్నది. వందల్లో ఉండే ఆస్తిపన్ను విషయంలో సామాన్యుడిని ముప్పుతిప్పలు పెట్టే అదికారులు..బహిరంగంగా బడాబాబులకు కొమ్ముకాస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.
క్యూర్ చట్టం అమలు ప్రకారం ఈ నెల 2వ తేదీ నుంచి ఆస్తిపన్ను మదింపులో రిజిస్ట్రేషన్ శాఖ నిర్దేశించే గైడ్లైన్ విలువ ఆధారంగా క్యాపిటల్ వాల్యూ విధానంలో అమల్లోకి తెచ్చారు. నివాస భవనాలకు 0.15, నివాసేతర భవనాలకు 0.75, ఖాళీ స్థలాలకు 0.50 శాతం చొప్పున కొత్త పన్ను భారం అందరిపై మోపారు. ఈ సమయంలో అసెస్ మెంట్ బాధ్యతలను ప్రజలపైకే నెట్టివేసిన జిహెచ్ఎంసీ, దానికి అనుగుణంగా సాంకేతిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో తీవ్రంగా విఫలమైంది.
ఆన్లైన్ స్వీయ మదింపు సమయంలో రహదారి కేటగిరీని ఎంపిక చేసిన తర్వాత దానికి అనుగుణంగా మార్కెట్ విలువ మారాల్సి ఉండగా కొన్ని సందర్భాల్లో సిస్టమ్ ముందుగా ఉన్న లేదా వేరే కేటగిరీకి సంబంధించిన విలువను డిఫాల్ట్‌గా తీసుకుంటున్నది. జూబ్లీహిల్స్ మెయిన్ రోడ్డులోని ఒక ఆస్తికి సంబంధించిన గైడ్ లైన్ విలువ చదరపు గజానికి రూ. 1.16 లక్షలు ఉండాలి. కానీ జీహెచ్ ఎంసీ పోర్టల్‌లో రహదారి కేటగిరీని ఎంపిక చేస్తే, అది డిఫాల్ట్ గా రూ. 74 వేలు అని మాత్రమే చూపిస్తోంది. ఈ క్రమంలోనే క్యాపిటల్ వాల్యూ విధానంలో ప్రతి చదరపు గజం విలువ కీలకం కావడంతో, చిన్న సాంకేతిక లోపం కూడా వేలల్లో తేడా చూపిస్తుంది.
ఒకే రహదారిలోని ఆస్తులకు వేర్వేరు కేటగిరీలు, పక్కనే ఉన్న ఇతర రోడ్ల మారెట్ విలువలను సిస్టమ్ ఆటోమేటిక్‌గా తీసేసుకోవడం ద్వారా అసెస్ మెంట్ డేటా మొత్తం తలకిందులవుతోంది. జుబ్లీహిల్స్ వంటి అత్యంత దనిక ప్రాంతంలో ఇలాంటి విచిత్రాలు జరుగుతుంటే, సాధారణ డివిజన్లు, బస్తీల్లో ఇంకెన్ని తప్పులు జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ సిస్టమ్‌లో కనిపిస్తున్న తప్పు విలువలు తాతాలికమే అని అధికారులు చెప్తున్నప్పటికీ, ఇవి ప్రాథమిక దశలోనే సిస్టమ్‌లో నమోదైపోతే భవిష్యత్తులో ప్రజలపై తీవ్ర ఆస్తిపన్ను భారం పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ సాంకేతిక అస్తవ్యస్తతను వెంటనే సరిదిద్దకపోతే, రాబోయే రోజుల్లో వేల సంఖ్యలో ఆస్తిపన్ను అప్పీళ్లు, వివాదాలు చెలరేగడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.:
జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా సేకరించిన ప్రాపర్టీ సరిహద్దులకు, రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఉన్న మారెట్ విలువ డేటాబేస్కు పొంతన కుదరడం లేదు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రకారం విలేజ్ అని ఉంటుందని, జీహెచ్ఎంసీ రికార్డుల ప్రకారం లోకాలిటీ అని ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే జీఐఎస్ మ్యాపింగ్ పాయింటర్లు, మారెట్ విలువలు మరియు పన్ను శాతాల గణన సరిగా జరగకపోవడంతో ఆస్తిపన్ను అసెస్ మెంట్లు తలకిందులవుతున్నాయి.
క్యూర్ చట్టంలో పన్నును ఆస్తి క్యాపిటల్ విలువతో అనుసందానించడం వల్ల ఆస్తి రకం వినియోగం, వర్తించే పన్ను శాతం వంటి దశల్లో తప్పులు దొర్లుతున్నాయి. తద్వారా ఖజానాకు భారీ గండిపడడమే కాకుండా సామాన్యులకు ఒక న్యాయం..బడాబాబులకో న్యాయం అన్న చందంగా ఆస్తిపన్ను గందరగోళంగా మారింది. అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండా, కనీస తనిఖీలు చేపట్టకుండా పోర్టల్‌ను అందుబాటులోకి తేవడంతో పన్ను చెల్లింపుదారులు తలలు పట్టుకుంటున్నారు. అన్నింటి కంటే మించి గెజిట్‌లో పేర్కొన్న అంశాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సిబ్బందికి అవగాహన కల్పించడకపోవడం ప్రధాన సమస్యగా మారిందన్న చర్చ జరుగుతున్నది.